నిజామాబాద్ లో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా బహిరంగ సభ

ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందడంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2019-12-27 05:22 GMT
అసదుద్దీన్‌ ఓవైసీ, వేముల ప్రశాంత్‌రెడ్డి

ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందడంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌లో యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో

ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశం ఏర్పాట్ల గురించి గురువారం మధ్యాహ్నం ఖిల్లా రోడ్డులోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్‌ మహ్మద్‌ రహీం అన్సారీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీరుద్దీన్‌ ముక్తార్, జిల్లా కన్వీనర్‌ హఫిజ్‌లయాఖ్‌న్, మౌలానా వరియుల్లాఖాన్సి, పెద్ది వెంకట్రాములు, భూమయ్య, రఫత్‌ఖాన్‌ పాల్గొని మాట్లాడారు.

భారీ ఎత్తున నిర్వహించే ఈ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని నిర్వహకులు తెలిపారు. ఎన్పీఆర్‌ను కూడా తాము వ్యతిరేకిస్తున్నమని వారు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసారు. ఈ సభకు బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు రానున్నట్లు చెప్పారు.   


Tags:    

Similar News