ప్రభుత్వ సూచనలు పాటించని యువత అరెస్ట్‌

కరోనా వైరస్ కట్టడి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాలకు లాక్ డౌన్ ప్రకటించింది.

Update: 2020-03-23 07:24 GMT

కరోనా వైరస్ కట్టడి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాలకు లాక్ డౌన్ ప్రకటించింది.ఈ నెల 31 వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఎం వెల్లడించారు. ఆదివారం ఏ విధంగానైతే ప్రజలు కర్ఫ్యూ పాటించారో అదే విధంగా పాటించాలని తెలిపారు. ప్రజలెవరూ రోడ్లపై తిరగవద్దని, స్వీయ నిర్భంధంలో ఉండాలని తెలిపారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. సామాజిక దూరం పాటించాలని కోరారు. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు సోకినట్లయితే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. లాక్ డౌన్ చేసిన జిల్లాలో తెల్ల రాషన్ కార్డు దారులకు రూ.1,500 ఇస్తామని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి వెల్లాలన్నారు.

ఇక ప్రభుత్వం ఇన్ని నిబంధనలు పెట్టినప్పటికీ కొంత మంది యువకులు వాటిని పాటించకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేసారు. ఈ సంఘటన జిల్లాలోని కొత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు యువకులను, సీజ్‌ చేసిన వాహనాలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేసిన యువకులను స్టేషన్లోనో ఉంచుతామని పోలీసులు తెలిపారు. నిత్యవసర వస్తువులు తీసుకోవడానికి, వైద్యులను సంప్రదించడానికి మాత్రమే రావాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ నిబంధలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags:    

Similar News