హైదరాబాద్‌లో లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలి
Loan Apps: లోన్ యాప్స్ వేధింపులతో ఫైర్‌మెన్ సుధాకర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలి
Loan Apps: హైదరాబాద్‌లో లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలయ్యారు. లోన్ యాప్స్ వేధింపులతో ఫైర్‌మెన్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. గోల్డెన్ రూపీ యాప్ ద్వారా సుధాకర్ 6 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. గతకొంత కాలంగా యాప్ నిర్వాహకులు సుధాకర్ బంధువులు, స్నేహితులకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సుధాకర్ తన అన్నకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన కాసేపటికే రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు సుధాకర్.