LB Nagar: ఇంట్లోకి చొరబడి అక్క.. తమ్ముడిని కత్తితో పొడిచిన దుండగుడు

LB Nagar: సంఘవీ హోమియోపతి వైద్యురాలిగా గుర్తింపు

Update: 2023-09-03 11:21 GMT

LB Nagar: ఇంట్లోకి చొరబడి అక్క.. తమ్ముడిని కత్తితో పొడిచిన దుండగుడు

LB Nagar: హైదారాబాద్‌ ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చొరబడి అక్క, తమ్ముడిని కత్తితో పొడిచాడో గుర్తు తెలియని వ్యక్తి. ఘటనలో అక్కకు, తమ్ముడికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడు చింటూ మృతి చెందాడు. ఆస్పత్రిలో అక్క సంఘవీకి చికిత్స కొనసాగుతోంది. సంఘవీ హోమియోపతి వైద్యురాలిగా గుర్తించారు. మృతి చెందిన అబ్బాయి బీటెక్ చదువుతున్నట్టు సమాచారం. ఈ దుశ్చర్యకు పాల్పడ్ద వ్యక్తి ఎవరు..ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News