Amit Shah: రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులతోపాటు.. సోషల్‌ మీడియా ఇంచార్జీలతో భేటీకానున్న షా

Update: 2024-03-11 09:39 GMT

Amit Shah: రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. రేపు అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్బీస్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 8 మందిని ప్రకటించిన బీజేపీ.. మరో 9 మంది గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలిపారు.

పోలిగ్ బూతుల అధ్యక్షుల సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూత్‌ల అధ్యక్షులను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి తెలిపారు. అమిత్ షా పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే సోషల్ మీడియా ఇంచార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News