Hyderabad: సీపీ సంచలన నిర్ణయం.. ఇన్‌స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డు వరకు.. అందరినీ ఏఆర్‌కు అటాచ్ చేసిన సీపీ
Hyderabad: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు.
Hyderabad: సీపీ సంచలన నిర్ణయం.. ఇన్‌స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డు వరకు.. అందరినీ ఏఆర్‌కు అటాచ్ చేసిన సీపీ
Hyderabad: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పీఎస్‌లోని సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్‌స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డు వరకు.. అందరినీ ఏఆర్‌కు అటాచ్ చేశారు సీపీ. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు.. కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల నుంచి కొత్త సిబ్బందిని నియమించారు.