Adilabad: కమ్ముకున్న మంచుదుప్పట్లు.. దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు
Adilabad: వేకువజాము నుండి కమ్ముకొంటున్న మంచు దుప్పట్లు
Adilabad: కమ్ముకున్న మంచుదుప్పట్లు.. దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు
Adilabad: పెరిగిన శీతలగాలుల తీవ్రతతో ఆదిలాబాద్ జిల్లా చలితో గజగజ వణుకుతోంది. వేకువ జాము నుండి మంచు దుప్పట్లు కమ్ముకోవడంతో దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారిపై పూర్తిగా మంచు పొగలు కమ్ముకోవడంతో అతికష్టంమీద నెమ్మదిగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా భీంపూర్ మండలం అర్లీటిలో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఉట్నూరు ఏజెన్సీలోని పలు మండలాలలో 8డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు ప్రకటించారు.