Accident at Nallamala Forest: నల్లమలలో ప్రమాదం.. ఇద్దరు మరణం

Accident at Nallamala Forest: నల్లమలలో నివాసముంటున్న చెంచులు అటవీ ఉత్పత్తులను సేకరించి, వాటిని అమ్మకం చేసి జీవనం సాగిస్తుంటారు.

Update: 2020-07-19 04:17 GMT
Nallamala Forest

Accident at Nallamala Forest: నల్లమలలో నివాసముంటున్న చెంచులు అటవీ ఉత్పత్తులను సేకరించి, వాటిని అమ్మకం చేసి జీవనం సాగిస్తుంటారు. అటవీ జీవనోపాదుల సేకరణలో ఎన్ని ఇబ్బందులున్నా వెళ్లక తప్పని పరిస్థితి. ఎందుకంటే వారంతా జీవించేది అడవులపైనే. అలాంటి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మరణం సంభవించకతప్పదు. ఇదే మాదిరి తేనే సేకరణ కోసం వెళ్లిన చెంచులు ప్రమాదవశాత్తూ జారి లోయలో పడటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలలోని జంగం రెడ్డిపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివాసి చెంచులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. నల్లమల అడవుల్లోని కొండల్లో తేనె పట్టును దింపుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఓ కొండ చివరన ఉన్న తేనె పట్టును దింపుతున్న సమయంలో వారు ఏర్పాటు చేసుకున్న తాడు తెగిపోయింది. దీంతో వారు లోయలో పడిపోయినట్లుగా సమాచారం.

లోయలో పడిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి. చెంచు గూడానకి చెందిన దాసరి బయన్న, దాసరి పెద్దలు, దాసరి వెంకటయ్య గుర్తించారు. తేనె తీయడానికి అడవికి వెళ్లగా ప్రమాదవశాత్తు తాడు తెగిపోయి ముగ్గురు లోయలో పడిపోయినట్లు జంగం రెడ్డిపల్లి గ్రామస్తులు తెలిపారు. ఇందులో దాసరి బయన్న (35), దాసరి పెద్దులు (28) చనిపోగా వెంకటయ్య కు కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు, అంతర గంగా శివాలయానికి కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News