KTR: కేటీఆర్ కు బిగ్ షాక్..ఏసీబీ నోటీసులు..రంగంలోకి కవిత
KTR: బీఆర్ఎస్ నాయకులను నోటీసులు వెంటాడుతున్నాయి. ఈమధ్యే కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు అందాయి. ఇప్పుడు మరో కీలక నేత కేటీఆర్ కు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ మే 28న హాజరు కావాలని ఏసీబీ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వెల్లడించారు. తన యూకే, యుఎస్ పర్యటన తర్వాత ఏసీబీ ముందు హాజరువుతానని తెలిపారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నన్ను మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. ఇది పూర్తిగా రాజకీయ వేధింపులకోణంలో జరుగుతున్నా..నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా విచారణకు సహకరిస్తాను అంటూ ఎక్స్ ఓ పోస్టు చేశారు.
తనపై జరుగుతున్న దాడుల వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన్ను ప్రతీకార రాజకీయాల నాయకుడిగా అభివర్ణించారు. 48గంటల కిత్రం నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జీషీట్లో చేర్చింది. కానీ 24 గంటలలోపే ఆయన ప్రధానిమోదీ సహా బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఇంత పెద్ద ఆరోపణలున్నా బీజేపీ నుంచి ఒక్క నిందా వాక్యమూ రాలేదంటు విమర్శలు చేశారు.
ఇక కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రజల ద్రుష్టిని వేరే దిశగా మళ్లించేందుకు తమ పరిపాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కేటీఆర్ కు నోటీసులు పంపించిందంటూ విమర్శించారు. ఇది పూర్తిగా కుటిల రాజకీయాల భాగంగా జరుగుతున్న చర్య అని తెలిపారు.