మొక్కను మేసిన ఎడ్లు.. రూ. 1000 ఫైన్ వేశారు..

హరితహారంలో నాటిన మొక్కలను మేపినందుకు ఎడ్ల యజమానికి జరిమానా విధించారు.

Update: 2019-09-02 04:33 GMT

మొన్నటి మొన్న వికారాబాద్‌లోని చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్క ఆకులను తినేసిన మేకకురూ.500 జరిమానా విధించిన ముచ్చట మరువక ముందే.. తాజాగా హరితహారంలో నాటిన మొక్కలను మేపినందుకు ఎడ్ల యజమానికి జరిమానా విధించారు. ఈ సంఘటన కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయిలో ఆదివారం చోటు చేసుకుంది. ఉగ్రవాయిలో గ్రామానికి చెందిన లంబాడి శంకర్‌కు చెందిన రెండు ఎడ్లు క్యాసంపల్లి తండా శివారులోని రైస్‌ మిల్‌ సమీపంలో కమ్యూనిటీ స్థలంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎడ్లు మేశాయి. ఎడ్లు మేయడం చూసిన గ్రామ కారోబార్‌ వెంటనే జీపీ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన కార్యదర్శి ఎడ్ల యాజమనాకి జరిమానా విధించాలని చెప్పడంతో జీపీ సిబ్బందితో ఎడ్ల యజమాని లంబాడి శంకర్‌ను పిలిపించి రూ.1000 జరిమాన విధించారు.

హరితహారంలో నాటిన మొక్కలను ఎవరూ మేపినా జరిమానాలు తప్పవని గ్రామ కార్యదర్శి పేర్కొన్నారు. ఇక మరోవైపు, పశువులు మొక్కలు తిన్నాయని రైతులకు జరిమానాలు వేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సర్కార్ గొల్లకుర్మలకు గొర్రలు అందజేస్తూ జరిమానాలు వేయడంపై గొల్లకుర్మలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మొన్న మేక, నేడు ఎడ్లు మొక్కలు తీన్నాయని జరిమానాలు విధించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నోరులేని మూగ జీవాలు తింటే జరిమానాలు వేయడం ఏంటి అని మండిపడుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హరితహారం మొక్క తిన్నందుకు ఎడ్లకు జరిమానా విధించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఎడ్లకు ఫైన్ వేశారా? అంటూ చర్చించుకుంటున్నారు. కాగా, మొక్కల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.



 


Tags:    

Similar News