రామంతపూర్‌లో విషాదం.. హోంగార్డు వేధింపులతో ఓ వ్యక్తి సూసైడ్
Hyderabad: శ్రీనివాస్‌ను హోంగార్డు నాగరాజు గన్‌తో బెదిరించినట్లు ఆరోపణ
రామంతపూర్‌లో విషాదం.. హోంగార్డు వేధింపులతో ఓ వ్యక్తి సూసైడ్
Hyderabad: హైదరాబాద్‌లోని రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో ఓ హోంగార్డు వేధింపులతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటి పక్కన నివాసముండే శ్రీనివాస్‌ను హోంగార్డు నాగరాజు గన్‌తో బెదిరించినట్లు ఆరోపించారు. అయితే గత మూడేళ్లుగా మృతుడు శ్రీనివాస్, హోంగార్డు నాగరాజు మధ్య వివాదం కొనసాగుతుందని స్థానికులు తెలిపారు.
హోంగార్డు బెదిరింపుల కారణంగానే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడని మృతదేహంతో హోంగార్డు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి బంధువులకు నచ్చజెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. గన్‌తో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.