HYD News: హైదరాబాద్ వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద పేలిన సిలిండర్
HYD News: సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీగా చెలరేగిన మంటలు
HYD News: హైదరాబాద్ వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద పేలిన సిలిండర్
HYD News: హైదరాబాద్ వనస్థలిపురంలో పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న స్నాక్స్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో షాపులో ఉన్న వర్కర్స్ బయటకు పరుగులు తీశారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో షాపు మొత్తం కాలిపోయింది. పక్కనే ఉన్న షాపునకు కూడా మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. బాంబు పేలిందేమోనని భయపడ్డారు. అనంతరం టిఫిన్ సెంటర్‌లో సిలిండర్ పేలిందన్న విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.