Adibatla Kidnap case: మన్నెగూడ కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్ట్
Adibatla Kidnap case: మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Adibatla Kidnap case: మన్నెగూడ కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్ట్
Adibatla Kidnap case: రంగారెడ్డి జిల్లా మన్నెగూడె యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులు 32 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చేస్తామన్నారు. నిందితులపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్న రాచకొండ సీపీ.. కిడ్నాప్‌నకు వినియోగించిన రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.