Peddapalli: పుట్టిన రోజే మృత్యు ఒడికి.. వేడి సాంబార్‌ పాత్రలో పడిన బాలుడు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది.

Update: 2025-12-09 07:09 GMT

Peddapalli: పుట్టిన రోజే మృత్యు ఒడికి.. వేడి సాంబార్‌ పాత్రలో పడిన బాలుడు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది. వేడి సాంబార్‌లో పడి మొక్షిత్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. మొక్షిత్ తల్లి తండ్రులు గురుకుల పాఠశాలలో వంట మనుషులుగా పని చేస్తున్నారు.

మొక్షిత్ తండ్రి సాంబారు చల్లారడం కోసం పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టగా అటు పక్కగా ఆడుకుంటున్న మొక్షిత్ వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని హాస్పిటల్‌కు తరలించే లోపే మొక్షిత్ మృతి చెందాడు. పుట్టిన రోజే మొక్షిత్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News