TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,175 కరోనా కేసులు, 15 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 2175 కేసులు నమోదయ్యాయి.

Update: 2021-06-04 14:00 GMT

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096 నమూనాలను పరీక్షించారు. ఇందులో 2వేల175 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 87వేల 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 15 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల346 కి పెరిగింది. ఈ రోజు 3వేల821 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 253 మందికి పాజిటివ్‌గా తేలింది.



Tags:    

Similar News