Telangana: నూతన ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 1969 తెలంగాణ ఉద్యమకారులు

Telangana: నూతన ప్రభుత్వం తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి

Update: 2023-12-08 14:18 GMT

Telangana: నూతన ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 1969 తెలంగాణ ఉద్యమకారులు

Telangana: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి 1969 తెలంగాణ ఉద్యమకారులు మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నూతన ప్రభుత్వానికి వారు సంఘీభావం తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమకారులైన తమను గత ప్రభుత్వం విస్మరించిందని ఉద్యమకారులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉధ్యమ కారులకు 250 గజాల ఇళ్ల స్థలం, 25 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలకు 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు హెల్త్ కార్డులు..ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News