TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు, 17 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 1,813 కేసులు నమోదయ్యాయి.

Update: 2021-06-09 15:15 GMT

కరోనా వైరస్‌ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,29,896 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1వేయి813 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 96వేల 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 17 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల426 కి పెరిగింది. ఈ రోజు 1వేయి801 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.



Tags:    

Similar News