Huzurabad Field Assistants: హుజూరాబాద్ బైపోల్ వార్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
*హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడిస్తాం- శ్యామలయ్య *2020లో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు- ఫీల్డ్ అసిస్టెంట్లు
హుజూరాబాద్ (ఫోటో- ది హన్స్ ఇండియా)
Huzurabad Field Assistants: హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమవుతున్నారు. దీంతో ఫీల్డ్ అసిసెంట్లు ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంటున్నారు. విడతల వారీగా నామినేషన్లు వేస్తామని ఇవాళ 50 మంది నామినేషన్లు వేస్తాం మొత్తం వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఓడిస్తామని 2020లో ప్రభుత్వం తమను నిర్దాక్షిణ్యంగా తొలగించిందన్నారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ల రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు.