ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇక్కడెందుకు చేయరు
-సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగిన సీపీఐ చాడ వెంకట్రెడ్డి -హక్కుల కోసం పోరాడుతుంటే సెల్ఫ్ డిస్మిస్ ఎలా అవుతారు -ఏపీలో ఆర్టీసీని విలీనం చేస్తే ఇక్కడెందుకు చేయరు
ఆర్టీసీ అనేది ఇప్పుడు పుట్టింది కాదని, నిజాం కాలం నుంచే ఉందన్న సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడతుంటే ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ పై చాడ నిప్పులు చెరిగారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిణితితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నువ్వేందుకు చేయవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.