Hyderabad Metro Train: మెట్రో రైలులో మందు బాబు హల్ చల్, మెట్రో ఎండీ ప్రెస్ మీట్

Update: 2019-09-14 05:15 GMT

హైదరాబాద్ మెట్రో రైలులో మద్యంరాయుళ్ల ఆగడాలు అరికట్టడానికి మెట్రో ఎండీ చర్యలు చేపట్టారు. మెట్రో ప్రయాణంలో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినా, ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు త్వరలో వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గతనెల 8న మద్యం సేవించిన వ్యక్తి మెట్రో లో న్యూసెన్స్ చేశాడు. తర్వాత అతడిని నెక్స్ట్ స్టేషన్ లో దించారు. మద్యంరాయుడి తీరుపై ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ను నియంత్రిస్తుండటంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఇక నుంచి మెట్రో రైలులో న్యూసెన్స్ లేకుండా చేయడానికి వాట్సాప్ నంబరుతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ప్రకటన చేశారు.  

Tags:    

Similar News