YouTube: యూట్యూబ్ యాడ్స్‌తో విసిగిపోయారా.? మీకోసమే యూట్యూబ్ ప్రీమియం లైట్ వచ్చేసింది..!
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
YouTube: యూట్యూబ్ యాడ్స్‌తో విసిగిపోయారా.? మీకోసమే యూట్యూబ్ ప్రీమియం లైట్ వచ్చేసింది..!
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది యూజర్లు ఈ వీడియో స్ట్రీమింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఉచితంగా సేవలను అందిస్తూ వచ్చిన యూట్యూబ్ ఇటీవల ప్రీమియం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ ప్రీమియం సేవల్లో భాగంగా యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను అందిస్తోంది గూగుల్. అయితే తాజాగా ప్రీమియం యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది యూట్యూబ్. ఇందులో భాగంగానే యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం తక్కువ ఖర్చుతో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. "యూట్యూబ్ ప్రీమియం లైట్" పేరిట ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ధర 7.99 డాలర్లు. ప్రస్తుతం అక్కడ యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధర 13.99 డాలర్లు. కొత్త లైట్ ప్లాన్‌తో చాలా వీడియోలు యాడ్ ఫ్రీగా వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే, అన్ని వీడియోలకు యాడ్ రాకుండా ఉండకపోవచ్చు. సాధారణ యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లో యాడ్‌ఫ్రీ వీడియోలతో పాటు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, డౌన్‌లోడ్ వంటి అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కానీ లైట్ ప్లాన్‌లో కేవలం యూట్యూబ్ వీడియోలు యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం మాత్రమే ఉంటుంది.
ఈ ప్లాన్‌ను త్వరలో ఆస్ట్రేలియా, జర్మనీ, థాయ్‌లాండ్ దేశాలకు విస్తరించనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. భారతదేశానికి ఈ ప్లాన్ వస్తుందా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.159, ఏడాదికి రూ.1490. ఫ్యామిలీ ప్లాన్ ధర నెలకు రూ.299.