Social Media: 7 గంటలపాటు స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు

Social Media: ఉదయం 4 గంటలకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు పునరుద్ధరణ...

Update: 2021-10-05 03:15 GMT

7 గంటలపాటు స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు

Social Media: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బంది పడ్డారు. కాగా.. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామన్న ఫేస్‌బుక్‌, దాదాపు 7 గంటల తర్వాత సేవలను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా సేవల అంతరాయంపై ఫేస్‌బుక్‌ క్షమాపణలు చెప్పింది.

ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందికిలా జరిగిందో అర్థంకాక హైరానా పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. పలువురు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలవైపు దృష్టి సారించారు. ఇక భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులుండగా, వాట్సాప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు.

Tags:    

Similar News