Samsung Galaxy S26 Ultra: డిజైన్, కెమెరా, బ్యాటరీ డీటెయిల్స్ లీక్.. భారీ మార్పులతో గెలాక్సీ S26 అల్ట్రా రెడీ!
Samsung Galaxy S26 Ultra: దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ 'శాంసంగ్' మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది.
Samsung Galaxy S26 Ultra: డిజైన్, కెమెరా, బ్యాటరీ డీటెయిల్స్ లీక్.. భారీ మార్పులతో గెలాక్సీ S26 అల్ట్రా రెడీ!
Samsung Galaxy S26 Ultra: దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ 'శాంసంగ్' మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. 'గెలాక్సీ S26 అల్ట్రా'ను మార్కెట్‌లోకి త్వరలోనే రిలీజ్ చేయనుంది. గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ఫిబ్రవరి 25న అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ఈవెంట్‌లో అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. ధరలపై ఇంకా స్పష్టత లేకపోయినా.. గతేడాది ధరలనే కొనసాగించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. గెలాక్సీ S25 అల్ట్రా భారత మార్కెట్లో రూ.1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ S26 అల్ట్రా లీకైన డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2022లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా నుంచి ఇప్పటివరకు అల్ట్రా మోడల్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు. చిన్నచిన్న ట్యూనింగ్‌లతోనే శాంసంగ్ కొనసాగుతూ వచ్చింది. అయితే గెలాక్సీ S26 అల్ట్రాతో మాత్రం గణనీయమైన డిజైన్ మార్పులు తీసుకురాబోతున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. గెలాక్సీ S26 అల్ట్రా అధికారిక రెండర్స్‌లో పూర్తిగా కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న విడివిడిగా కెమెరా కట్‌అవుట్ల స్థానంలో ఈసారి ఒకే యూనిఫైడ్ కెమెరా మాడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది గెలాక్సీ Z ఫోల్డ్ 7 తరహాలో ఉండనుందని సమాచారం. అంతేకాదు ఫోన్ కార్నర్స్ కూడా గత మోడళ్లతో పోలిస్తే మరింత రౌండెడ్‌గా ఉండనున్నాయి. లీక్ అయిన రెండర్స్‌లో గెలాక్సీ S26 అల్ట్రా కోబాల్ట్ వైలెట్, బ్లాక్ రంగుల్లో కనిపిస్తోంది. అయితే మార్కెట్లోకి వచ్చేటప్పుడు వైట్, సిల్వర్ షాడో, స్కై బ్లూ, పింక్ గోల్డ్ రంగుల్లో కూడా లభించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫోన్ మందం కూడా స్వల్పంగా తగ్గనుంది. గెలాక్సీ S25 అల్ట్రా 8.2 మిల్లీమీటర్ల మందం ఉండగా.. S26 అల్ట్రా కేవలం 7.9 మిల్లీమీటర్లతో మరింత స్లిమ్‌గా కనిపించనుంది.
ఫ్రంట్ డిజైన్ విషయానికి వస్తే.. చాలా తక్కువ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే కనిపిస్తోంది. గెలాక్సీ S26 అల్ట్రా 6.9 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేతో రానుందని సమాచారం. పబ్లిక్ ప్లేస్‌లలో ఫోన్ ఉపయోగించినప్పుడు పక్కన ఉన్నవారికి సున్నితమైన సమాచారం కనిపించకుండా చేసే కొత్త ఇన్‌బిల్ట్ ప్రైవసీ ఫీచర్‌ను కూడా సామ్‌సంగ్ పరిచయం చేసే అవకాశం ఉంది. గెలాక్సీ S26 అల్ట్రా ముందస్తు మోడల్‌లా క్వాడ్ కెమెరా సెటప్‌ను కొనసాగించనుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోప్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్‌ను బట్టి వేర్వేరు ప్రాసెసర్లతో గెలాక్సీ S26 అల్ట్రా రానుంది. కొన్ని దేశాల్లో శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2600 చిప్‌సెట్ ఉండగా, మరికొన్ని మార్కెట్లలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతోనే రానుంది. అయితే ఛార్జింగ్ విషయంలో అప్‌గ్రేడ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. అదనంగా Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కారణంగా.. ఆపిల్ మాగ్‌సేఫ్‌తో కూడా కంపాటిబుల్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి భారీ మార్పులతో గెలాక్సీ S26 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ రెడీ అయింది.