OnePlus 16 Leaks: 240Hz డిస్‌ప్లే, 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. అసలు సిసలైన ఫ్లాగ్‌షిప్ వస్తోందా?

OnePlus 16 Leaks: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే 'వన్‌ప్లస్' కంపెనీ నుంచి మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ వస్తోంది. 'వన్‌ప్లస్ 16'ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Update: 2026-02-01 15:30 GMT

OnePlus 16 Leaks: 240Hz డిస్‌ప్లే, 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. అసలు సిసలైన ఫ్లాగ్‌షిప్ వస్తోందా?

OnePlus 16 Leaks: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే 'వన్‌ప్లస్' కంపెనీ నుంచి మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ వస్తోంది. 'వన్‌ప్లస్ 16'ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 చివరలో విడుదలయ్యే ఈ ఫ్లాగ్‌షిప్‌ గురించి ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. వన్‌ప్లస్ 16కు సంబంధించిన ప్రాథమిక లీకులు ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇంకా అధికారికంగా ఏమీ వెల్లడించకపోయినా.. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం ఇది ఒక సూపర్ ఫ్లాగ్‌షిప్ అని అనిపిస్తోంది.

లీకుల ప్రకారం... వన్‌ప్లస్ 16లో ఫ్లాట్ BOE X5 OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1220p రిజల్యూషన్‌తో పాటు 240Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మించి ఉండే ఈ డిస్‌ప్లే.. గేమింగ్, మల్టీమీడియా అనుభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా వన్‌ప్లస్ ఎలాంటి రాజీ పడనట్టే ఉంది. ఇందులో Qualcomm Snapdragon Elite Gen 6 ప్రాసెసర్ ఇవ్వనున్నట్లు లీకులు చెబుతున్నాయి. దీనితో పాటు LPDDR6 ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ కారణంగా ఫోన్ స్పీడ్, మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్.. అన్నీ సూపర్ స్మూత్‌గా ఉండనున్నాయని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

బ్యాటరీ సెగ్మెంట్‌లో అయితే వన్‌ప్లస్ 16 టెక్ ప్రియులకు షాక్ ఇవ్వొచ్చని అంటున్నారు. లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 9000mAh బిగ్ బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాదు 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఇదే నిజమైతే.. బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో ఇది గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. కెమెరా విషయంలో కూడా వన్‌ప్లస్ వెనక్కి తగ్గడం లేదని లీకులు సూచిస్తున్నాయి. ఇందులో డ్యుయల్ 200MP సామ్‌సంగ్ సెన్సార్లు ఉండే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఇది వన్‌ప్లస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అదనంగా అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో భాగంగా ఉండనున్నట్లు సమాచారం.

వన్‌ప్లస్‌ 15 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గత నవంబర్ 14న లాంచ్‌ అయింది. 2024లో విడుదలైన వన్‌ప్లస్‌ 13కు 15 కొనసాగింపుగా వచ్చింది. వన్‌ప్లస్‌ 15లో 7300 ఎంఏహెచ్‌ సిలికాన్‌ కర్బన్‌ బ్యాటరీ ఉండగా.. వన్‌ప్లస్‌ 16లో 9000mAh ఉండనుంది. వన్‌ప్లస్‌ 15లో 50MP కెమెరా ఉండగా.. 16లో 200MP ఉండే అవకాశాలు ఉన్నాయి. 12జీబీ+256జీబీ వన్‌ప్లస్‌ 15 వేరియంట్‌ ధర రూ.72,999గా ఉండగా.. 16 కాస్ట్ మరింత ఎక్కువగా ఉండనుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన డీటెయిల్స్ చూస్తే.. OnePlus 16 ఒక పవర్‌ఫుల్, ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌గా మార్కెట్‌ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News