Vodafone Idea: రెండు కొత్త ప్లాన్‌లని ప్రవేశపెట్టిన వొడాఫోన్ ఐడియా..!

Vodafone Idea: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తర్వాత, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా 30, 31రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Update: 2022-04-04 08:54 GMT

Vodafone Idea: రెండు కొత్త ప్లాన్‌లని ప్రవేశపెట్టిన వొడాఫోన్ ఐడియా..! 

Vodafone Idea: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తర్వాత, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా 30, 31రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 30, 31 రోజుల వ్యాలిడిటీతో కనీసం ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను చేర్చాలని TRAI టెలికాం ఆపరేటర్‌లను కోరిన తర్వాత ఈ ప్లాన్లని ప్రవేశపెట్టింది. మీరు క్యాలెండర్ నెల ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎంచుకుంటే మీరు వచ్చే నెల అదే తేదీన రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Vodafone రూ. 327 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 100SMSలతో 25GBని అందిస్తుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, Vi మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇది రోజువారీ డేటా ప్రయోజనాలను అందించదు. సబ్‌స్క్రైబర్‌లు మొత్తం 25GB డేటాను పొందుతారు. ఇది ఒక నెలకు సరిపోతుంది. కానీ మీరు అధిక వినియోగదారు అయితే మీరు రోజువారీ డేటా ప్రయోజనాలతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడం మంచిది.

అదేవిధంగా Vodafone అందించే రూ. 337 ప్రీపెయిడ్ ప్లాన్ 31 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 100 SMSలతో 28GB వరకు డేటా అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, Vi మూవీస్, టీవీకి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా ప్రయోజనాలతో రాదు.

జియో రూ.259 ప్లాన్ ఒక నెల వాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజూ 1.5 జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు ఇస్తారు. ఇందులో జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తారు. ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB డేటా వస్తుంది. ఇది కాకుండా అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు ఇస్తారు. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

Tags:    

Similar News