Vivo V50 First Sale: ఈరోజే వివో కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.. ఆఫర్లు భలేగా ఉన్నాయి భయ్యా..!
Vivo V50 First Sale: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో 'V' సిరీస్‌లో Vivo V50ని టెక్ మార్కెట్లో లాంచ్ చేసింది.
Vivo V50 First Sale: ఈరోజే వివో కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.. ఆఫర్లు భలేగా ఉన్నాయి భయ్యా..!
Vivo V50 First Sale: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో 'V' సిరీస్‌లో Vivo V50ని టెక్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సంవత్సరం కంపెనీ విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. వి50 ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. కాగా, ఈరోజు (ఫిబ్రవరి 25) నుంచి ఈ మొబైల్ సేల్‌కి రానుంది. ఫోన్ స్టైలిష్ డిజైన్, ఫీచర్లు ఇప్పటికే వివో ప్రేమికులను ఆకర్షించేలా ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లను తెలుసుకుందాం.
వివో V50 ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ రూ. 36,999కి విడుదల చేశారు. అలాగే, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.40,999కి కొనచ్చు. కంపెనీ మొదటి సేల్‌పై కొన్ని ఆఫర్లను అందిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ మొబైల్ కొనే కస్టమర్‌లకు 10శాతం తగ్గింపు లభిస్తుంది.
ఫోన్ ఈరోజు (ఫిబ్రవరి 25) మధ్యాహ్నం 12 గంటల నుండి తన మొదటి సేల్‌ను ప్రారంభించనుంది. ఈ వివో ఫోన్ రోజ్ రెడ్, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఈ-స్టోర్‌ల ద్వారా సేల్‌కి వస్తుంది.
Vivo V50 Specifications
వివో V50 ఫోన్‌లో 2392 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీని కూడా ఉంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టా- కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్ ఉన్నాయి. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది.
వివో V50 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అందించారు. ఫోన్ 6000mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది.