Vivo V50 Launched: వివో నుంచి కొత్త ఫోన్.. ZEISS కెమెరాలతో ఫోటోలు అదిరిపోతాయ్..!
Vivo V50 Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo తన కొత్త ఫోన్‌ను దేశంలో విడుదల చేసింది. ఫోన్ 'Vivo V50' పేరుతో మార్కెట్లోకి వచ్చింది.
Vivo V50 Launched: వివో నుంచి కొత్త ఫోన్.. ZEISS కెమెరాలతో ఫోటోలు అదిరిపోతాయ్..!
Vivo V50 Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo తన కొత్త ఫోన్‌ను దేశంలో విడుదల చేసింది. ఫోన్ 'Vivo V50' పేరుతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ కెమెరాలను ZEISS టెక్నాలజీతో డెవలప్ చేశారు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. కెమెరా, AI ఫీచర్లు కాకుండా 6000mAh బ్యాటరీ కలిగిన అత్యంత సన్నని ఫోన్ ఇదే కావడం విశేషం. ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది. అందులో రోజ్ రెడ్, స్టార్రి నైట్, టైటానియం గ్రే ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఒకసారి చూద్దాం.
Vivo V50 Price
కొత్త వివో V50 ఫోన్‌ను మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు 8GB + 128GB ధర రూ. 34,999. కాగా, 8GB+256GB ధర రూ.36,999. 12GB+512GB ధర రూ.40,999. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది, సేల్ ఫిబ్రవరి 25 నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
Vivo V50 Specifications
వివో V50లో అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే వివో V సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోమొదటిది. Vivo V50 6.77-అంగుళాల డిస్ప్లేతో 2392x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం డైమండ్ షీల్డ్ గ్లాస్ ఉంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అందించారు. ఫోన్‌లో 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారంగా FuntouchOS 15లో రన్ అవుతుంది. అంతేకాకుండా 90W ఫాస్ట్-ఛార్జ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉంది.
వివో V50లో ZEISS కో-ఇంజనీరింగ్ కెమెరా సిస్టమ్ ఉంది. వెనుకవైపు, 50MP OIS కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP AF సెన్సార్ ఉంది. వివో ఈ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ AI ఫీచర్లతో వస్తుంది. ఈ ఫీచర్స్‌లో సర్కిల్ టు సెర్చ్, Vivo లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ ఉన్నాయి.