ఎవరు రిప్లై ఇవ్వాలో డిసైడ్‌ చేయోచ్చంట.. కొత్త ఫీచర్లపై ట్విట్టర్ ప్రయోగాలు

Twitter New Update 2021: ఓవైపు కొత్త ఐటీ రూల్స్‌తో ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చూస్తుంది.

Update: 2021-06-07 11:54 GMT

ట్విట్టర్ (ఫొటో ట్విట్టర్)

Twitter New Update 2021: ఓవైపు కొత్త ఐటీ రూల్స్‌తో ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చూస్తుంది. మరోవైపు యూజర్లను ఆకట్టుకోవడానికి కొత్త ఫీచర్లను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా అలాంటి రెండు ఫీచర్లపై ట్విట్టర్ మేనేజ్‌మెంట్ పనిచేస్తుందని తెలుస్తోంది. ట్వీట్ చేశాక.. దానికి ఎవరు రిప్లై ఇవ్వాలో కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చంట. అయితే దీనిపై ట్విట్టర్ ఇంతరకు ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు యూజర్లకు అందిస్తారో మాత్రం స్పష్టత లేదు. అలాగే సూపర్ ఫాలోస్‌ అనే ఫీచర్ ని కూడా త్వరలో పరిచయం చేయనుందంట. ఈ ఫీచర్ తో ఫాలోవర్స్‌కు అదనంగా మరింత కటెంట్‌ను అందించేందుకు సహాయ పడుతుందని సమాచారం. కాగా ఈ ఫీచర్లను రివర్స్ ఇంజినీరింగ్ నిపుణుడు జేన్‌ మంచున్ వాంగ్ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు జూన్ 5న వాంగ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. 'మన ట్వీట్లకు ఎవరు రిప్టై ఇవ్వాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్‌పై ట్విట్టర్ పనిచేస్తుంది. ట్వీట్ చేశాక.. ఆ ట్వీట్‌ తో ఎవరు ఇంటరాక్ట్ అవ్వాలో యూజర్లు సెలక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ ట్వీట్‌కు రిప్లై‌ ఇవ్వకుండా కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌‌లో ఉంది.'

అయితే ఈ ఫీచర్‌పై కొంతమంది యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకున్న ట్వీట్లను తొలగిస్తుందా.. లేదా కొత్త ట్వీట్‌ను పోస్ట్‌ చేయకుండా చేస్తుందా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, ట్విట్టర్ సూపర్ ఫాలోస్‌ ఫీచర్‌ పనిచేస్తుందని తెలిపిన వాంగ్.. వాటికి కొన్ని కండీషన్లు కూడా ఉండనున్నట్లు తెలిపాడు. ఈ ఫీచర్‌ను సాధారణ యూజర్లు పొందాలంటే..

1. కనీసం 10,000 మంది ఫాలోవర్స్‌ ఉండాలి.

2. గత 30 రోజుల్లో కనీసం 25 ట్వీట్స్‌ చేసి ఉండాలి.

3. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఇవి ఉంటేనే యూజర్లు సూపర్ ఫాలోవర్స్‌ ఫీచర్‌ను పొందవచ్చని ఆయన పేర్కొన్నాడు.

ఇక చివరగా, ఒక సేఫ్టీ మోడ్‌ను కూడా తీసుకరాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వరుసగా వారం నుంచి అడల్డ్‌ భాషను ఉపయోగిస్తూ ట్వీట్లు చేస్తే... వారి అకౌంట్లు ఆటోమాటిక్‌ బ్లాక్‌ అవనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి ఫీచర్లు ఎప్పుడు యూజర్లకు అందిచనుందో మాత్రం తెలియలేదు.

 

Tags:    

Similar News