Airtel New Plans 2026: ఎయిర్‌టెల్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.399, రూ.449లో భారీ ఆఫర్లు!

భారత టెలికాం రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ టెలికాం సంస్థ 'ఎయిర్‌టెల్' తన వినియోగదారుల కోసం రెండు కొత్త ఫుల్ అన్‌లిమిటెడ్ 4G/ 5G ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

Update: 2026-02-04 05:47 GMT

Airtel New Plans 2026: ఎయిర్‌టెల్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.399, రూ.449లో భారీ ఆఫర్లు!

Airtel New Plans 2026: భారత టెలికాం రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ టెలికాం సంస్థ 'ఎయిర్‌టెల్' తన వినియోగదారుల కోసం రెండు కొత్త ఫుల్ అన్‌లిమిటెడ్ 4G/ 5G ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.399, రూ.449 ధరలతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్లు.. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్స్, ఓటీటీ బెనిఫిట్స్‌లో అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. హై డేటా వినియోగదారులు, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లు రూపొందించబడినట్లు తెలుస్తోంది.

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 300GB వరకు FUPతో అన్‌లిమిటెడ్ 4G/5G డేటా లభిస్తుంది. ఎలాంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నారు. డిజైన్, కంటెంట్ క్రియేషన్‌లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఆఫర్‌గా మారనుంది.

రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ మరింత రిచ్ ఫీచర్లతో వస్తోంది. ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 300GB వరకు అన్‌లిమిటెడ్ 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాదు ఇందులో గూగుల్ వన్ 30GB క్లౌడ్ స్టోరేజ్, జియో హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజులు), సోనీ లివ్, ఎక్స్‌ట్రీమ్‌ ద్వారా 20కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ యాక్సెస్, అలాగే ఆపిల్ మ్యూజిక్ (6 నెలలు) వంటి ప్రీమియం డిజిటల్ బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రూ.399, రూ.449 అన్‌లిమిటెడ్ ప్లాన్లు డేటా హేవీ యూజర్లు, ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5G స్పీడ్‌తో పాటు భారీ ఓటీటీ, డిజిటల్ సర్వీసుల కలయిక ఈ ప్లాన్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్లు ఎంచుకున్న సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఇండియా మొత్తం ఈ ప్లేన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News