Truecaller: స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి ముందుగానే ట్రూ కాలర్ ఇన్‌స్టాల్..?
Truecaller: స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి ముందుగానే ట్రూ కాలర్ ఇన్‌స్టాల్..?
Truecaller: స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి ముందుగానే ట్రూ కాలర్ ఇన్‌స్టాల్..?
Truecaller: ప్రపంచం టెక్నాలజీలో దూసుకెళుతుంది. అందులో స్మార్ట్‌ఫోన్లు కొత్త విప్లవం సృష్టించాయనే చెప్పవచ్చు. అరచేతిలో ప్రపంచాన్ని మీ ముందు ఉంచుతుంది. 2జి, 3జి, 4జి, అంటూ త్వరలో 5 జి కూడా రాబోతుంది. ఎన్నో యాప్‌లు మరెన్నో సేవలు. అందులో ఒకటి ట్రూ కాలర్ యాప్. దీనిద్వారా మనకు ఎవరు కాల్ చేశారా అనేది సులువుగా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
కాలర్ ఐడెంటిఫికేషన్‌లో ఈ యాప్‌నకు తిరుగులేదు. అయితే ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ట్రూ కాలర్ యాప్ ప్రీ లోడెడ్‌గా రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కంపెనీలతో ట్రూకాలర్ యాప్ యాజమాన్యం ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి వచ్చినా యూజర్ ఇష్టాన్ని బట్టీ ఆ యాప్‌ను ఉపయోగించుకునే ఆప్షన్ ఉంటుంది. యూజర్‌కు ఇష్టం లేకపోతే ట్రూ కాలర్ యాప్‌ను వినియోగించకుండా ఉండే వెసులు బాటు కూడా కల్పించారు.
భారత్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, లాటిన్ అమెరికాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో వంద మిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రూ కాలర్ ముందే ఇన్‌స్టాల్ అయి రానుంది. ఇక గత సంవత్సరం ట్రూ కాలర్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. వీడియో కాలర్ ఐడీతో పలు ఫీచర్స్‌ను పరిచయం చేసింది. కాగా ఇకపై స్మార్ట్‌ఫోన్స్‌లో ట్రూ కాలర్ యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుందని ఆ సంస్థ సీఈవో అలెన్ మామెది వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరికీ చేరువ కావాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ వెల్లడించారు.