Smart Phones: ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు 6000 mah బ్యాటరీ బలంతో వస్తాయి..!

Smart Phones: కొంతమంది చాలా డబ్బులు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొంటారు. కానీ బ్యాటరీ తొందరగా అయిపోతుంది.

Update: 2022-04-05 11:30 GMT

Smart Phones: ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు 6000 mah బ్యాటరీ బలంతో వస్తాయి..!

Smart Phones: కొంతమంది చాలా డబ్బులు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొంటారు. కానీ బ్యాటరీ తొందరగా అయిపోతుంది. అందుకే మొబైల్‌ కొనేటప్పుడు బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించాలి. చాలా కంపెనీలు తక్కువ ధరలోనే 6000 mah బ్యాటరీ బ్యాకప్‌ ఉన్న సరసమైన ఫోన్లని మార్కెట్లోకి విడుదల చేశాయి. అలాంటి కొన్ని స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. samsung galaxy F41: ఈ స్మార్ట్‌ఫోన్ 6 GB RAMతో 128 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. దీని డిస్‌ప్లే 6.4 అంగుళాలు, దీనికి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి పవర్ ఇవ్వడానికి 6000mAH బ్యాటరీని అందించారు. Amazonలో దీని ధర రూ.16,999.

2. Redmi 9 పవర్: ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో 64 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. దీని డిస్ప్లే 6.53 అంగుళాలు. ఇది క్వాడ్ రేర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి పవర్ ఇవ్వడానికి 6000mAH బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.13,450.

3. Poco M3: ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో 64 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. దీని డిస్ప్లే 6.53 అంగుళాలు. ఇది ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి పవర్ ఇవ్వడానికి, 6000mAH బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 10,999.

4. Realme Narzo 50A: ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో 128 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. దీని డిస్ప్లే 6.5 అంగుళాలు. ఇది ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి పవర్ ఇవ్వడానికి, 6000mAH బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.12,499.

5. Moto G40: ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAMతో 64 GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. దీని డిస్ప్లే 6.78 అంగుళాలు. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి పవర్ ఇవ్వడానికి 6000mAH బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.14,499.

Tags:    

Similar News