Smart Phone: మీ ఫోన్‌లో ఈ మార్పులా.? అయితే మీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే..!

Smart Phone: స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచమే మారిపోయింది. అరచేతిలో ఇమిడి పోతున్న ఫోన్‌ ప్రపంచాన్నే అరచేతిలోకి తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2024-12-11 13:30 GMT

Smart Phone: మీ ఫోన్‌లో ఈ మార్పులా.? అయితే మీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే..!

Smart Phone: స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచమే మారిపోయింది. అరచేతిలో ఇమిడి పోతున్న ఫోన్‌ ప్రపంచాన్నే అరచేతిలోకి తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్మార్ట్‌ ఫోన్‌తో ఎంత మేలు జరుగుతుందో, అదే స్థాయిలో అనర్థం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో స్మార్ట్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఫోన్‌లోని సమాచారాన్ని కాజేస్తున్నారు. అయితే మన ఫోన్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందన్న విషయాన్ని కొన్ని సిగ్నల్స్‌ ద్వారా తెలుసుకోవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల మాల్‌వేర్స్‌ను ఫోన్‌లోకి పంపించి కేటుగాళ్లు ఫోన్‌ను రిమోట్‌గా మార్చేస్తున్నారు. దీంతో మీ ఫోన్‌లోని కెమెరాను, మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ చేస్తున్నారు. అలాగే స్క్రీన్‌ రికార్డుతో మీరు చేస్తున్న పనులన్నింటిపై ఓ కన్నేస్తున్నారు. ఒకవేళ మీ ఫోన్‌లో గ్రీన్‌ నోటిఫికేషన్‌ కనిపించినా, కెమెరా దగ్గర ఉండే ఫ్లాష్‌ లైట్స్‌ వాటంతటవే ఆన్‌ అవుతున్నట్లు ఉన్నా, మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉన్నట్లు అనిపించినా మీ ఫోన్‌ హ్యాక్‌ అయిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి గమనిస్తే మీరు ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్న సమయంలో రికార్డింగ్ ఆప్షన్‌కి యాక్సెస్‌ ఇచ్చారో చెక్‌ చేసుకోవాలి. ఒకవేళ ఇచ్చి ఉంటే వెంటనే యాక్సెస్‌ క్యాన్సిల్‌ చేయాలి, లేదంటే ఆ యాప్‌ను డిలీట్‌ చేయాలి.

ఇక యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో మనకు తెలియకుండానే కెమెరా, మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ ఇస్తుంటాం. వీటివల్ల కూడా మీరు మాట్లాడుతున్న ప్రతీ మాట ఎవరికో వినిపించే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా లొకేషన్‌ కూడా ప్రతీసారి యాక్సెస్‌ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇక ఒకవేళ మీ ఫోన్‌ బ్యాటరీ ఊరికే డిస్‌ఛార్జ్‌ అవుతుంటే కూడా మీ ఫోన్‌ను ఎవరో కంట్రోల్‌ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

అలాగే మీ ఇంటర్నెట్ డేటా కూడా వేగంగా తగ్గిపోతుంటే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని అర్థం చేసుకోవాలి. ఫోన్‌ హ్యాక్‌కి గురైతే.. మీకు తెలియకుండా బ్యాగ్రౌండ్‌లో యాప్స్‌ రన్‌ అవుతుంటాయి. ఈ కారణంగానే అటు బ్యాటరీతో పాటు, ఇటు డేటా కూడా త్వరగా ఖర్చవుతుంది. ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతకు ముందు డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌ను కూడా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఒకసారి వాటికి ఏయే పర్మిమిషన్స్‌ ఇచ్చారో చెక్‌ చేసుకోవాలి. అవసరం లేని వాటికి పర్మిషన్స్‌ ఇస్తే వాటిని క్యాన్సిల్‌ చేయాలి. యాప్‌ ఉపయోగించుకునే సమయంలో పర్మిషన్స్‌ ఇచ్చి ఆ తర్వాత వాటిని క్యాన్సిల్‌ చేయడం మంచిది. 

Tags:    

Similar News