Crossbeats Diva: అమ్మాయిల కోసం స్టైలిష్ స్మార్ట్‌వాచ్‌.. ఇక డబ్బులు జేబు నుంచి తీయనవసరం లేదు..!

Crossbeats Diva: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. యువత వీటివైపు ఎక్కువగా ఆకర్షిలవుతున్నారు. దాదాపు స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉంటున్నాయి.

Update: 2023-11-05 02:30 GMT

Crossbeats Diva: అమ్మాయిల కోసం స్టైలిష్ స్మార్ట్‌వాచ్‌.. ఇక డబ్బులు జేబు నుంచి తీయనవసరం లేదు..!

Crossbeats Diva: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. యువత వీటివైపు ఎక్కువగా ఆకర్షిలవుతున్నారు. దాదాపు స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉంటున్నాయి. ఫోన్‌ ద్వారా చేసే అన్ని పనులు ఇప్పుడు వీటిద్వారా చేయవచ్చు. మార్కెట్‌లో రూ.1000 నుంచి రూ.లక్ష వరకు స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. కొత్తగా క్రాస్‌బీట్స్ అనే కంపెనీ మహిళల కోసం క్రాస్‌బీట్స్ దివా పేరుతో స్టైలిష్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. క్రాస్‌బీట్స్ దివా మెటాలిక్ బిల్డ్‌తో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. Crossbeats Diva ధర, ఫీచర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

క్రాస్‌బీట్స్ దివా స్పెక్స్

క్రాస్‌బీట్స్ దివా 7 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందించే శక్తివంతమైన స్మార్ట్‌వాచ్. ఇది 700 nits బ్రైట్‌నెస్‌తో, 1.28-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. రోజులో ఏ సమయంలోనైనా వీక్షించడానికి గొప్ప స్క్రీన్ కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్‌వాచ్‌లలో అలారం, కాలిక్యులేటర్, సెడెంటరీ రిమైండర్, స్టాప్‌వాచ్, వాతావరణ అప్‌డేట్‌లు, బ్లూ టూత్‌ కాలింగ్‌, సంగీతం, కెమెరా కంట్రోల్‌, అలాగే రిమైండర్‌లు, అలర్ట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయి. బ్లూటూత్ 5.3 మద్దతుతో స్థిరమైన, తక్కువ లేటెన్సీ కనెక్షన్‌ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ నుంచి సమాచారాన్ని, నోటిఫికేషన్‌లను సులభంగా స్వీకరించవచ్చు.

ఇది హార్ట్‌బీట్‌రేటు, SpO2, నిద్ర, రక్తపోటు వంటి ఆరోగ్య పర్యవేక్షణను అందిస్తుంది. కాబట్టి శారీరక దృఢత్వాన్ని ట్రాక్ చేయవచ్చు. స్టోన్-స్టడెడ్ డిజైన్ దీనికి స్టైలిష్ అప్పీల్‌ని ఇస్తుంది. ఇది 100కి పైగా వాచ్ ఫేస్‌లతో వస్తుంది కాబట్టి మీరు ఇష్టమైన శైలిని అనుసరించవచ్చు. ఇది నీరు, ధూళి నిరోధకత కోసం IP67-రేట్ తో వచ్చింది. కాబట్టి ఎటువంటి చింత లేకుండా ధరించవచ్చు. స్మార్ట్‌వాచ్ FitCloud ప్రో యాప్‌ని ఉపయోగిస్తుంది ఇది మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ డేటాను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఇది 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. కాబట్టి మీకు ఇష్టమైన వర్కౌట్‌లను ట్రాక్ చేయవచ్చు. క్రాస్‌బీట్స్ దివా ధర రూ. 3499. ఇది Amazon, Crossbeats అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News