Mini AC: దంచి కొట్టే ఎండలకు ఈ మినీ ఏసీతో చెక్ పెట్టేయండి.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే.. ధర తెలిస్తే ఇంటికి తెచ్చేస్తారంతే..!

Mini AC: వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడి తారాస్థాయికి చేరుకుంటుంది.

Update: 2024-04-18 14:30 GMT

Mini AC: దంచి కొట్టే ఎండలకు ఈ మినీ ఏసీతో చెక్ పెట్టేయండి.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే.. ధర తెలిస్తే ఇంటికి తెచ్చేస్తారంతే..!

Mini AC: వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడి తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఏసీలు, కూలర్ల కోసం వెతుకులాడుతున్నారు. అయితే, ఏసీలు, కూలర్లు ఎక్కువ ధర ఉంటాయి. వీటి వాడకం కూడా ఖర్చుతో కూడుకున్నది. అయితే, అందరూ వీటిని వాడలేరు. ఈ క్రమంలో మినీ ఏసీలు లేదా పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.2500లలోపే అందుబాటులో ఉన్న మినీ ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని ఆఫీసు టేబుల్‌లు, కిచెన్‌, షాప్ కౌంటర్‌లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు.

ఈ క్రమంలో వచ్చిందే.. సింఫని డ్యూయెట్ మినీ పోర్టబుల్ టేబుల్‌టాప్ ఎయిర్ కూలర్. వేసవి ఎండల్లో ఎండలకు చల్లని గాలి కోసం వెతుకుతున్నారా? అయితే, మీరు తప్పకుండా సింఫని డ్యూయెట్ మినీ పోర్టబుల్ టేబుల్‌టాప్ ఎయిర్ కూలర్‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే, సింఫని డ్యూయెట్ మినీ పోర్టబుల్ టేబుల్‌టాప్ ఎయర్ కూలర్‌ మీకు చక్కని పరిష్కారం.

పోర్టబుల్, కంపాక్ట్ డిజైన్: ఇది చిన్నదిగా ఉంటుంది. డిజైన్‌లోనూ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీంతో ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ని ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఇంటిలోని వివిధ ప్రదేశాలలో లేదా ఆఫీసులో డెస్క్‌‌పైన కూడా ఉపయోగించుకోవచ్చు.

సైలెంట్‌గా పని: నిద్రాభంగం కలగకుండా ఉండేలా ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌‌ను రూపొందించారు. ఈ ఎయర్ కూలర్‌ చాలా తక్కువ శబ్దంతో నడుస్తుంది.

టచ్ కంట్రోల్: ఈ ఎయర్ కూలర్‌ టచ్ స్క్రీన్‌తో ఉంటుంది. దీని ద్వారా ఫ్యాన్ స్పీడ్‌, స్వింగ్ ఫంక్షన్‌ వంటి వాటిని సులభంగా నియంత్రించవచ్చు.

6 లీటర్ల వాటర్ ట్యాంక్: ఒకసారి ఫుల్ చేస్తే, చాలా సేపటి వరకు చల్లని గాలిని అందిస్తుంది.

కూలింగ్ ప్యాడ్స్: మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేకమైన కూలింగ్ ప్యాడ్స్‌తో ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ వస్తుంది.

స్వింగ్ ఫంక్షన్: చల్లని గాలిని గది అంతటా వ్యాప్తి చేసేందుకు సహాయపడుతుంది.

ధర: దీని అసలు ధర రూ. 3999లుగా ఉంది. అయితే, 45 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 2199లకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

ఎండాకాలం వేడిని ఇంటి నుంచి, ఆఫీసు నుంచి దూరంగా ఉంచడానికి సింఫని డ్యూయెట్ మినీ ఎయర్ కూలర్‌ అనువైన ఎంపికగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News