Google Maps Fuel Saving Feature: గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఫ్యూయల్‌ ఆదా చేయండి.. కారు మైలేజీ పెంచండి..!

Google Maps Fuel Saving Feature: నేటి రోజుల్లో ఇంధన ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది వాహనాలు తీసుకోవడానికి జంకుతున్నారు.

Update: 2023-12-18 14:30 GMT

Google Maps Fuel Saving Feature: గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఫ్యూయల్‌ ఆదా చేయండి.. కారు మైలేజీ పెంచండి..!

Google Maps Fuel Saving Feature: నేటి రోజుల్లో ఇంధన ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది వాహనాలు తీసుకోవడానికి జంకుతున్నారు. మరికొంతమంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గూగుల్‌ మ్యాప్స్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు ఇప్పటి వరకు నావిగేషన్ కోసం Google Mapsని ఉపయోగిస్తున్నారు. దీనికి కొత్తగా ఫ్యూయల్‌ సేవింగ్‌ ఫీచర్ యాడ్‌ చేశారు. ఇది వాహనంలో ప్రయాణించే వారికి ఒక వరమని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో భారతీయులకు కూడా అందుబాటులోకి రానుంది.

Google Maps fuel saving feature ఎలా పనిచేస్తుంది..?

గూగుల్‌ మ్యాప్స్‌ ఫ్యూయల్‌ సేవింగ్‌ ఫీచర్‌ మీరు వెళ్లే మార్గంలో ఎంత ఇంధనాన్ని ఖర్చు చేయబోతున్నారో అంచనా వేస్తుంది. ఆ మార్గంలో ప్రస్తుత ట్రాఫిక్, రహదారి పరిస్థితుల ఆధారంగా గూగుల్ దీనిని అంచనా వేస్తుంది. తర్వాత ఇంధనాన్ని ఆదా చేసే మరొక మార్గాన్ని మీకు చూపుతుంది. గూగుల్ దాని పనిని అది చేస్తుంది కానీ మీరు ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నారో అది మీపై ఆధారపడి ఉంటుంది.

Google Maps fuel saving feature ఎలా ఆన్ చేయాలి..?

ముందుగా ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ని ఓపెన్‌ చేసి యాప్‌లో కనిపించే మీ ప్రొఫైల్ చిత్రం లేదా మీ పేరులోని మొదటి అక్షరాలు (మీ పేరు, ఇంటిపేరులోని మొదటి అక్షరాలు)పై నొక్కండి. తర్వాత సెట్టింగ్‌లకు వెళ్లి నావిగేషన్ ఎంపికపై నొక్కండి. తర్వాత రూట్ ఆప్షన్‌కి వెళ్లాలి. తర్వాత ఇంధన-సమర్థవంతమైన మార్గాలను నొక్కండి. ఈ ఫీచర్‌ను ఆన్ చేయండి. తర్వాత ఇంజిన్ రకంపై క్లిక్ చేసి ఇచ్చిన ఆప్సన్స్‌ చూస్‌ చేసుకోండి. మీ వాహనంలో ఏ ఇంజన్ అమర్చారో గూగుల్‌ మ్యాప్స్‌కి సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. అప్పుడే కొత్త ఫీచర్ ఎంత ఇంధనాన్ని ఆదా చేయగలరో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News