Samsung S23 Ultra 5G Price Drop: ఆఫర్ అదిరిందయ్యా.. సామ్‌సంగ్ రూ.1.5 లక్షల ఫోన్ సగం ధరకే..!
Samsung S23 Ultra 5G Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ని ప్రకటించింది. తన వినియోగదారుల కోసం మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌ని తీసుకొచ్చింది.
Samsung S23 Ultra 5G Price Drop: ఆఫర్ అదిరిందయ్యా.. సామ్‌సంగ్ రూ.1.5 లక్షల ఫోన్ సగం ధరకే..!
Samsung S23 Ultra 5G Price Drop
ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ని ప్రకటించింది. తన వినియోగదారుల కోసం మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌ని తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అత్యుత్తమ డీల్స్‌ను చూడొచ్చు. ఈ సేల్ జనవరి 31 వరకు లైవ్‌లో ఉంటుంది. మీరు ప్రీమియం ఫోన్లను కొనాలనే ప్లాన్‌లో ఉంటే ఈ ఆఫర్లను మిస్ అవ్వద్దు. సామ్‌సంగ్ రూ.1.5 లక్షల ఫోన్ ప్రస్తుతం సేల్‌లో సగం ధరకే అందుబాటులో ఉంది. రండి.. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ సామ్‌సంగ్ ప్రీమియం Galaxy S23 Ultra 5Gని మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో సగం ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ని 2023లో రూ. 1,49,999కి లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అలానే రూ. 74,499కి ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జీ ఇప్పటికీ ఉత్తమ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లలో ఒకటి. స్మార్ట్‌ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్ వంటి అధునాతన గెలాక్సీ AI ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో 12జీబీ ర్యామ్+ 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జీ దాని క్వాడ్ కెమెరా సెటప్‌తో సూపర్ క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 5x ఆప్టికల్ జూమ్‌ను అందించే రెండు 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా, ఈ ఫోన్‌లో కొత్త S25 సిరీస్‌లో ఉండే అనేక ఫీచర్లు ఉంటాయి.