DSLRతో ఇక పనిలే.. 200MP కెమెరాతో విడుదల కానున్న రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూస్తే పరేషానే..!
Realme 11 Pro+: రియల్‌మీ తన 11 సిరీస్‌లను మే 10న ప్రారంభించబోతోంది. అయితే ఎన్ని ఫొన్‌లను విడుదల చేస్తున్నారో కంపెనీ వెల్లడించలేదు.
DSLRతో ఇక పనిలే.. 200MP కెమెరాతో విడుదల కానున్న రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూస్తే పరేషానే..!
Realme 11 Pro+: రియల్‌మీ తన 11 సిరీస్‌లను మే 10న ప్రారంభించబోతోంది. అయితే ఎన్ని ఫొన్‌లను విడుదల చేస్తున్నారో కంపెనీ వెల్లడించలేదు. నివేదికల మేరకు, ఇందులో Realme 11 Pro+తో పాటు Realme 11, Realme 11 Pro కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రియల్‌మే కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఇది టాప్-ఆఫ్-లైన్ ఫోన్ డిజైన్, కెమెరా ఫీచర్లపై బాగా ఫోకస్ చేస్తోంది. టీజర్ ప్రకారం, Realme 11 Pro+ కెమెరా లెన్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే, ఈ అధికారిక రిలీజ్‌కు ముందు, Realme 11 Pro+ 5G డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Realme 11 Pro+ ఫీచర్లు..
Realme 11 Pro+ తాజా టీజర్ స్మార్ట్‌ఫోన్ వెనుకాల పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని, బంగారం, నలుపు రంగులలో డ్యూయల్ టోన్ డిజైన్‌తో ఉంటుందని నిర్ధారిస్తుంది. కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, మిగిలిన రెండు సెన్సార్‌ల గురించి ఎటువంటి సమాచారం లేదు. కెమెరా మాడ్యూల్ పైభాగంలో LED ఫ్లాష్ కూడా ఉంది.
Realme 11 Pro+ డిజైన్..
ఈ ఫోన్ వెనుక ఓ ఫ్రేమ్‌ను కలిగి ఉందంట. లేత గోధుమరంగు ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్ 'సన్‌రైజ్ సిటీ' పేరుతో ఉంటుందంట. వెనుక ప్యానెల్ బంగారం, వెండి రంగంలో నిలువు గీతను కలిగి ఉంటుందంట. అలాగే, ఫోన్ ఫ్రేమ్ బంగారు రంగును కలిగి ఉంటుంది. పవర్,వాల్యూమ్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉన్నాయి. అయితే SIM ట్రే, USB టైప్-C పోర్, స్పీకర్ గ్రిల్ దిగువ అంచున ఉన్నాయి.
Realme 11 Pro+ స్పెసిఫికేషన్స్..
Realme 11 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డైమెన్సిటీ 7-సిరీస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో రానుందంట.