Pegasus Virus: క్లిక్ చేస్తే ఇక మీ ప్రైవసీ గోవిందా..!!

Update: 2021-07-20 12:52 GMT

Pegasus Spyware

Pegasus Virus: గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని వార్తల్లోనూ పెగసాస్ దాడి గురించి హెచ్చరిస్తున్నారు. చివరిసారిగా నవంబర్ 2019లో ఈ దాడి గురించి వార్త రాగా తాజాగా మళ్ళీ ఇప్పుడు పెగసాస్ స్పైవేర్ దాడి వెలుగుచూసింది. ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది దేశ నాయకులు, వాట్సాప్ యూజర్లు, జర్నలిస్టులు మరియు కార్యకర్తలతో సహా వాట్సాప్ నుండి సందేశాలు అందుకున్నప్పుడు, పెగసాస్ వారి ఫోన్లను హ్యాక్ చేసిందని చెప్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలు దీనిని చాలా దేశ భద్రత కోసం తరచుగా ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయల్ కి చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను మరియు వారి కదలికలను తెలుసుకోవడానికి పెగసాస్ అనే స్పైవేర్ ని తయారు చేసింది.

అయితే గతంలోనే పెగసాస్ వైరస్ ని దాదాపుగా 20 దేశాలకి సంబంధించిన లా ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇంటలిజెన్స్ ఏజెన్సీలలో పలువురి సర్టిఫైడ్ వ్యక్తులకు మాత్రమే ఇచ్చామని, ఆ తర్వాత వారు పెగసాస్ వైరస్ ని ఎవరిపై ఉపయోగిస్తున్నారు.., ఎందుకు ఉపయోగిస్తున్నారో తమ వద్ద సమాచారం ఉండదని ఎన్ఎస్ఓ తెలిపింది. అయితే మొబైల్ ఫోన్స్ లో ఈ పెగసాస్ వైరస్ కొన్ని ఫార్వర్డ్ మెసేజ్ లలో లింక్ ల ద్వారా వస్తుందని ఆ లింక్ క్లిక్ చేస్తే అది వెంటనే మొబైల్ లోకి చేరడంతో ఆ మొబైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెగసాస్ వైరస్ ని సాధారణ ప్రజలపై కాకుండా సంబంధిత వ్యక్తుల యొక్క కాల్స్, మెసేజెస్, వాట్సప్ తో కెమెరాకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ హ్యాక్ అవుతాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News