Windows 10 Update: మీ ప్రింటర్ తో సిస్టం క్రాష్ అయ్యే ఛాన్స్!

Windows 10 Update: మీ ప్రింటర్ విండోస్ తో పనిచేసే డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ తో కనెక్ట్ చేసి వాడుతున్నారా!

Update: 2021-03-12 09:28 GMT

విండోస్ 10 (ఫైట్ ఫొటో)

Windows 10 Update: మీ ప్రింటర్ విండోస్ తో పనిచేసే డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ తో కనెక్ట్ చేసి వాడుతున్నారా!. అయితే ఇది మీకు చాలా బ్యాడ్ న్యూస్. కొత్తగా వచ్చిన విండో స్ అప్ డేట్ తో మీ ప్రింటర్ సహాయంతో మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు సమస్య వచ్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సిస్టం ను అప్ డేట్ చేసి ప్రింటర్ వాడుతుంటే..బ్లూ స్ర్కీన్ ఎర్రర్ వస్తుందని, ఆ తర్వాత ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా.."మీ సిస్టం లో ప్రాబ్లం ఉంది. రీస్టార్ చేయండి" అని మెసేజ్ చూసిస్తుందని వెల్లడిస్తున్నారు.

ఎర్రర్ వచ్చిన విండోస్ యూజర్లు రీడిట్ లో సమస్యను ప్రస్తావించారు. ఓ యూజర్ కి సంబందించిన నాలుగు కంప్యూటర్లు ఇదే ప్రాబ్లంతో ఆగిపోయాయని అనగా, మరో యూజర్ విండోస్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి కంప్లీట్ చేశానని అన్నారు. మీరు ఇలాంటి బ్లూ స్ర్కీన్ ఎర్రర్ తో బాధపడుతున్నారా.. అయితే మీకోసం చాలా తేలికైన చిన్న టిప్ తో..మీ పాత విండ్‌స్ వర్షన్ ని పొందవచ్చు...

- సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి

- అక్కడ అప్ డేట్ & సెక్యూరిటీ పై క్లిక్ చేయాలి

- ఇప్పుడు విండోస్ అప్‌డేట్ పై క్లిక్ చేయాలి

- ఇక్కడ అప్‌డేట్ హిస్టరీ లోకి వెళ్లాలి

- దీంట్లో యునిస్టాల్ అప్‌డేట్స్ ని క్లిక్ చేయాలి. లేదా కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్లి మాన్యువల్ గా పాథ్ ని రిమూవ్ చేయడంతో మీ పాత విండోస్ వర్షన్ ని పొందవచ్చు.

ఈ టిప్ తో చాలా మంది యూజర్లు తమ పాత విండో‌స్ వర్షన్ ను పొందారని రీడిట్ లో పోస్ట్ చేశారు. మీరు కూడా ట్రై చేసి మీ బ్లూ స్ర్కీన్ ఎర్రర్ నుండి విముక్తి  పొందండి.

Tags:    

Similar News