నాసా మూన్‌ మిషన్‌ 'ఆర్టెమిస్ 1' లాంచ్ వాయిదా.. హైడ్రోజన్‌ లీకేజీతో కౌంట్‌డౌన్‌ నిలిపివేత

Artemis-1: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ ఆర్టెమిస్‌ 1 ప్రయోగానికి బ్రేక్ పడింది.

Update: 2022-08-29 13:37 GMT

నాసా మూన్‌ మిషన్‌ ‘ఆర్టెమిస్ 1’ లాంచ్ వాయిదా.. హైడ్రోజన్‌ లీకేజీతో కౌంట్‌డౌన్‌ నిలిపివేత 

Artemis-1: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక మూన్‌ మిషన్‌ ఆర్టెమిస్‌ 1 ప్రయోగానికి బ్రేక్ పడింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఇంజిన్‌లో హైడ్రోజన్‌ లీక్‌తో సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. T-40 నిమిషాల వద్ద కౌంట్‌డౌన్ నిలిపివేసినట్లు నాసా తెలిపింది. దీంతో సెప్టెంబర్‌ 9న తిరిగి మరోసారి ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్‌-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.


Tags:    

Similar News