Motorola Edge 60 5G: బెస్ట్ ఫీచర్స్.. ఆకర్షణీయమైన ఫీచర్స్.. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Motorola Edge 60 5G: ప్రముఖ అమెరికన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన రాబోయే మోటరోలా ఎడ్జ్ 60 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
Motorola Edge 60 5G: బెస్ట్ ఫీచర్స్.. ఆకర్షణీయమైన ఫీచర్స్.. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్..!
Motorola Edge 60 5G: ప్రముఖ అమెరికన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన రాబోయే మోటరోలా ఎడ్జ్ 60 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ పేరును కంపెనీ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, దాని డిజైన్, లుక్ అది మోటరోలా ఎడ్జ్ 60 5జీ అని సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుందని నిర్ధారించారు. కంపెనీ తన మెయిన్ కెమెరాకు 50MP ని ఇచ్చిం. దానిని మూడు కలర్స్‌లో పరిచయం చేసింది. మోటరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Motorola Edge 60 5G Launch Date
ఈ రాబోయే Motorola 5G స్మార్ట్‌ఫోన్ గురించి చాలా మంది టిప్‌స్టర్‌లు ఇప్పటికే పోస్ట్ చేశారు. మోటరోలా ఈసారి కెమెరా విభాగంపై దృష్టి సారించి మోటరోలా ఎడ్జ్ 60 5జీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని అధికారిక పోస్ట్ వెల్లడించింది. అలాగే, ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌కు దాదాపు రూ.25,000 ప్రారంభ ధరతో వస్తుందని భావిస్తున్నారు.
Motorola Edge 60 5G Features
మోటరోలా ఎడ్జ్ 60 5జీ స్మార్ట్‌ఫోన్ 10-బిట్ కలర్ డెప్త్, 6.7-అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో రానుంది. మెరుగైన ఆడియో కోసం ఇది డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఇస్తుందని కూడా భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అయ్యే అవకాశం ఉంది.
వెనుక కెమెరా సెటప్‌లో 50MP Sony LYTIA 700C మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్, మాక్రో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 30x సూపర్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. చివరగా, దాని బ్యాటరీ ఎంపికలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక వెర్షన్ 5500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.