JIO Free Data: వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో.. 100 జీబీ డేటా ఉచితం..!

JIO Free Data: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా కొనసాగుతోంది.

Update: 2022-07-17 13:30 GMT

JIO Free Data: వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో.. 100 జీబీ డేటా ఉచితం..!

JIO Free Data: రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా కొనసాగుతోంది. ఈ కంపెనీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్‌లు, ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా ఇటీవల సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీనికింద కొంతమంది ప్రత్యేక వినియోగదారులకు 100GB హై స్పీడ్ ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి.. దీనికి ఎవరు అర్హులు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఇటీవల జియో స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఇందులో వినియోగదారులకు 100GB ఇంటర్నెట్‌తో పాటు జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలను అందిస్తోంది. జియో హెచ్‌పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్ అందరికీ వర్తించదు. దీని ప్రయోజనం కొంతమంది హెచ్‌పి ల్యాప్‌టాప్‌ల వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలంటే మీరు కొత్త HP LTP ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేసి ఉండాలి. అంతేకాదు ఈ ల్యాప్‌టాప్‌లని రిలయన్స్‌ డిజిటల్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో లేదా JioMart వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసి ఉండాలి.

ఈ ఆఫర్ కింద మీకు రూ. 1,500 విలువైన 100GB హై స్పీడ్ ఇంటర్నెట్ ఉచితంగా అందిస్తారు. ఇది 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు కొత్త జియో సిమ్‌ కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి. డేటా వ్యాలిడిటీ గడువు ముగిసేలోపు 100GB డేటా అయిపోయినట్లయితే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుందని గుర్తుంచుకోండి. మీరు HP స్మార్ట్ SIM ల్యాప్‌టాప్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే HP Smart LTE 100GB ఆఫర్‌లో కొత్త Jio SIMని యాక్టివేట్ చేయమని మీరు Reliance Digital అధికారిని అడగండి.

Tags:    

Similar News