iPhone 16: ఐఫోన్ 16 ప్రో క్రేజీ డీల్.. క్రోమా సేల్‌లో భారీ డిస్కౌంట్..!

iPhone 16: క్రోమా ప్రత్యేక సేల్‌లో ఐఫోన్ 16 ప్రోపై భారీ తగ్గింపు.. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో కస్టమర్లకు అదిరిపోయే డీల్.

Update: 2026-03-05 09:22 GMT

iPhone 16: ఐఫోన్ 16 ప్రో క్రేజీ డీల్.. క్రోమా సేల్‌లో భారీ డిస్కౌంట్..!

iPhone 16: ఆపిల్ లవర్స్‌కి ఇది నిజంగా పండగ లాంటి వార్త అనే చెప్పాలి. ఐఫోన్ 16 ప్రో మోడల్ మీద క్రోమా స్టోర్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తోంది. సాధారణంగా ఆపిల్ ప్రో సిరీస్ ఫోన్ల మీద ధరలు తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఈ సేల్‌లో ఏకంగా రూ. 15,000 కంటే ఎక్కువ ఆదా చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మీరు ఒకవేళ కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉంటే ఈ డీల్ అస్సలు మిస్ అవ్వద్దు.

ఈ ఆఫర్ కేవలం నేరుగా వచ్చే డిస్కౌంట్ మాత్రమే కాదు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలిపితే ఈ భారీ మొత్తం తగ్గుతుంది. ఐఫోన్ 16 ప్రో అసలు ధరతో పోలిస్తే క్రోమాలో లభించే కార్డ్ డిస్కౌంట్లు యూజర్లకు భారీ ఊరటనిస్తున్నాయి. మీ దగ్గర పాత ఐఫోన్ ఉంటే దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఇంకా తక్కువ ధరకే ఈ ప్రో మోడల్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఐఫోన్ 16 ప్రో అంటేనే అల్టిమేట్ కెమెరా ఎక్స్‌పీరియెన్స్. ఇందులో ఉన్న కొత్త ఏ18 ప్రో చిప్ గేమ్ ఛేంజర్ అని చెప్పాలి. ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రొఫెషనల్ కెమెరా లాగా పనిచేస్తుంది. వీడియో రికార్డింగ్‌లో కూడా ఆపిల్ తన మార్క్ చూపిస్తూ అద్భుతమైన ఫీచర్లను జోడించింది. అందుకే కంటెంట్ క్రియేటర్లకి ఇది మొదటి ఛాయిస్ అవుతోంది.

ప్రో మోడల్ డిస్ప్లే క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత వేగవంతమైన ప్రోమోషన్ టెక్నాలజీతో స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా ఆపిల్ ఈసారి గట్టిగానే దృష్టి పెట్టింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఆరాంగా వాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం వల్ల బిజీ లైఫ్‌లో ఉన్నవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది.

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. స్టాక్ అయిపోకముందే క్రోమా వెబ్‌సైట్ లేదా దగ్గరలోని స్టోర్‌కి వెళ్లి డీల్ చెక్ చేయడం మంచిది. ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి వెళ్లాలనుకునే వారికి లేదా పాత మోడల్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్. ఇంత తక్కువ ధరకు ప్రో మోడల్ దొరకడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

Tags:    

Similar News