WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది..ఒకసారి చెక్ చేసుకోండి

WhatsApp: సైబర్ దాడులను అరికట్టడానికి వాట్సాప్ ఈ 'లాక్‌డౌన్ స్టయిల్' సెక్యూరిటీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

Update: 2026-01-29 07:35 GMT

WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది..ఒకసారి చెక్ చేసుకోండి

WhatsApp: నేటి కాలంలో డిజిటల్ రిస్క్ అనేది అందరికీ పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరిగే సైబర్ దాడులను అరికట్టడానికి వాట్సాప్ ఈ 'లాక్‌డౌన్ స్టయిల్' సెక్యూరిటీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక బటన్ క్లిక్‌తో మీ అకౌంట్‌ను అత్యంత కఠినమైన భద్రత వలయంలోకి తీసుకెళ్తుంది. గుర్తుతెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ఇకపై మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. అవి ఆటోమాటిక్‌గా మ్యూట్ అవుతాయి. అయితే, కాల్ వచ్చిన సమాచారం మాత్రం మీ కాల్ లాగ్‌లో కనిపిస్తుంది.

తెలియని వ్యక్తులు పంపే ఫొటోలు, వీడియోలు లేదా మరేదైనా ఫైల్స్‌ను ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా బ్లాక్ చేస్తుంది. దీనివల్ల హానికరమైన మాల్‌వేర్ మీ ఫోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.సాధారణంగా మనం ఏదైనా లింక్ పంపినప్పుడు థంబ్‌నెయిల్ కనిపిస్తుంది. ఈ మోడ్ ఆన్ చేస్తే, ఆ ప్రివ్యూలు నిలిపివేయబడతాయి. దీనివల్ల మీ ఐపీ అడ్రస్ వంటి వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉంటాయి.సెక్యూరిటీ కోసం వేర్వేరు సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా, సింగిల్ స్విచ్‌తో అన్ని ఫీచర్లను ఒకేసారి యాక్టివేట్ చేసుకోవచ్చు.

యాపిల్, గూగుల్ దారిలో వాట్సాప్

ఇప్పటికే యాపిల్ సంస్థ తన యూజర్ల కోసం లాక్‌డౌన్ మోడ్‌ను, గూగుల్ 'అడ్వాన్స్ ప్రొటెక్షన్ మోడ్'ను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే స్థాయిలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ అడ్వాన్స్డ్ లేయర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఉండే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుంది.

Tags:    

Similar News