WhatsApp: వాట్సాప్‌కు ఎలాన్ మస్క్ చెక్ ..ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్

WhatsApp: ప్రస్తుతం మనం మెసేజ్ పంపాలన్నా, ఫోటో షేర్ చేయాలన్నా టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. కానీ, ఇకపై ఆ స్థానాన్ని 'ఎక్స్ చాట్' భర్తీ చేయబోతోంది.

Update: 2026-01-29 07:27 GMT

WhatsApp: వాట్సాప్‌కు ఎలాన్ మస్క్ చెక్ ..ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్

WhatsApp: ప్రస్తుతం మనం మెసేజ్ పంపాలన్నా, ఫోటో షేర్ చేయాలన్నా టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. కానీ, ఇకపై ఆ స్థానాన్ని 'ఎక్స్ చాట్' భర్తీ చేయబోతోంది. ఎక్స్ వేదికగా మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఎక్స్ యాప్‌ను కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా, ఒక 'మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్'గా మార్చాలనేది ఆయన అసలు లక్ష్యం.

సాధారణంగా వాట్సాప్‌లో ఒకరితో మాట్లాడాలంటే మన ఫోన్ నంబర్ వారికి తెలియాలి. కానీ ఎక్స్ చాట్‌లో మీ ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఆడియో , వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇది యూజర్ల ప్రైవసీకి పెద్ద ప్లస్ పాయింట్.మీ చాటింగ్ అత్యంత సురక్షితంగా ఉండేలా సెక్యూర్ కనెక్షన్స్‌ను ఎక్స్ చాట్ అందిస్తోంది. అంటే మీ మెసేజ్‌లు మీరు ,అవతలి వ్యక్తి తప్ప మరెవరూ చూడలేరు.మీరు పంపిన మెసేజ్‌లు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా మాయమైపోయేలా సెట్ చేసుకోవచ్చు. సీక్రెట్ చాటింగ్ చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఏ రకమైన డాక్యుమెంట్స్ లేదా మీడియా ఫైల్స్‌నైనా ఎటువంటి అంతరాయం లేకుండా షేర్ చేసుకోవచ్చు.

మస్క్ 'మాస్టర్ ప్లాన్' ఏంటి?

మస్క్ ఆలోచన ప్రకారం ఎక్స్ అనేది కేవలం వార్తలు చూసే చోటు మాత్రమే కాదు, అది ఒక ఎవ్రీథింగ్ యాప్. అంటే అక్కడే పేమెంట్స్ చేయొచ్చు, అక్కడే చాటింగ్ చేయొచ్చు, అక్కడే వీడియోలు చూడొచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉన్న డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసి XChat ఇంటర్‌ఫేస్‌ను రూపొందించారు.

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌లో ఉంది. అంటే కొంతమంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే దీనిని పరీక్షించే అవకాశం ఇచ్చారు. అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఎక్స్ చాట్ ఫీచర్లు పూర్తిస్థాయిలో కావాలంటే సబ్‌స్క్రిప్షన్ ఉండాలని తెలుస్తోంది. ఫ్రీ యూజర్లకు పరిమితమైన ఫీచర్లు ఇస్తారా లేదా అనేది మస్క్ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచారు. మొత్తానికి వాట్సాప్ ఆధిపత్యానికి గండి కొట్టేలా మస్క్ వేస్తున్న ఈ అడుగు సోషల్ మీడియా ప్రపంచంలో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News