Honda: హీరో స్ప్లెండర్‌కి పోటీగా కొత్త బైక్‌ తీసుకొస్తున్న హోండా..!

Honda: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) స్కూటర్ సెగ్మెంట్‌లో హోండా యాక్టివాతో గట్టి పట్టు సాధించింది.

Update: 2022-02-26 09:55 GMT

Honda: హీరో స్ప్లెండర్‌కి పోటీగా కొత్త బైక్‌ తీసుకొస్తున్న హోండా..!

Honda: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) స్కూటర్ సెగ్మెంట్‌లో హోండా యాక్టివాతో గట్టి పట్టు సాధించింది. కానీ మోటార్‌సైకిల్ విభాగంలో క్లిక్ కాలేకపోతుంది. ఇప్పుడు అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. హీరో మోటోకార్ప్‌కు పోటీగా ఈ కొత్త బైక్‌లను విడుదల చేస్తుంది. కొత్త వాహనాలను తీసుకురావడానికి కంపెనీ ఒక అధ్యయనం చేసింది. ఇప్పటివరకు కంపెనీ CD110తో మాత్రమే తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు110 నుంచి 150 సిసి సెగ్మెంట్లో కూడా బైకులను విడుదల ఆలోచిస్తోంది. ఇది వినియోగదారులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

HMSI ప్రెసిడెంట్ అసుషి ఒగాటా మాట్లాడుతూ.. "సహజంగానే మాకు CD110 వంటి చవకైన మోటార్‌సైకిల్ ఉంది. కానీ మార్కెట్‌లో పోటీతో పోల్చితే మేము చాలా బలహీనంగా ఉన్నాం. కస్టమర్ల అభిరుచికి మేము సరిపోలలేదని దీని అర్థం. అందుచేత సరసమైన బైక్‌ల విభాగం ఎంత విస్తృతంగా ఉందో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. దీనికి సంబంధించి ఒక అధ్యయనం చేశాను. ఇప్పుడు ఈ విభాగంలో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయబోతున్నాము. హీరో స్ప్లెండర్‌కు పోటీగా హోండా షైన్ 110 సిసి వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేస్తున్నాం. ఇది కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఎలక్ట్రిక్ యాక్టివాను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది' అని తెలిపాడు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో మొత్తం 42 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 56 శాతం 75 నుంచి 110 సిసి విభాగంలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం అసాధారణమైనది. ప్రతి నాలుగు మోటార్‌సైకిళ్లలో మూడు హీరో సొంతం. HMSI ప్రస్తుతం ఈ విభాగంలో 3.6 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. అయితే జపాన్‌కు చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీదారులు 110 నుంచి 125 సిసి విభాగంలో మెరుగైన పట్టును కలిగి ఉన్నారు. 

Tags:    

Similar News