Health: దగ్గు శబ్ధంతో లంగ్స్ వ్యాధిని గుర్తించవచ్చు.. ఏఐ టెక్నాలజీతో సాధ్యమే..!
ఈ టెక్నాలజీ పేరు హియర్ (హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్). దగ్గు శబ్దాలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తికి TB లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి తీవ్రమైన వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు.
Health: దగ్గు శబ్ధంతో లంగ్స్ వ్యాధిని గుర్తించవచ్చు.. ఏఐ టెక్నాలజీతో సాధ్యమే..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లో అనివార్యంగా మారింది. వైద్య రంగంలో కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీ ఆధారంగా ఎన్నో అధునాతన యంత్రాలు పుట్టుకొస్తున్నాయి. వైద్య రంగంలో సరికొత్త అధ్యయనాలకు తెర తీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సరికొత్త టెక్నాలజీని పరిశోధకులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో మన దగ్గు శబ్ధం ఆధారంగా ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించవచ్చు.
వినడానికి వింతనాగనే ఉన్నా త్వరలోనే ఈ సరికొత్త టెక్నాలజీ నిజం కానుంది. దగ్గు శబ్దాన్ని వినడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించే సరికొత్త టెక్నాలజీని గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ పేరు హియర్ (హెల్త్ ఎకౌస్టిక్ రిప్రజెంటేషన్స్). దగ్గు శబ్దాలను విశ్లేషించడం ద్వారా ఒక వ్యక్తికి TB లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి తీవ్రమైన వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు. వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఈ టెక్నాలజీ ద్వారా ప్రాథమికంగా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే ముందే.. 300 మిలియన్లకు పైగా ఆడియో క్లిప్‌లు, సుమారు 100 మిలియన్ దగ్గు శబ్దాలపై పరిశోధన చేశారు. దీని కారణంగా దగ్గు శబ్ధం ఆధారంగా ఊపిరితిత్తుల వ్యాధిని గుర్తించగలదు. త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రానుంది. గూగుల్ తన సాంకేతికతను మెరుగుపరచడానికి భారతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన Salcit Technologiesతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కలిసి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇందులో భాగంగానే దగ్గు శబ్దాన్ని వింటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేసే స్వాసా అనే టూల్‌ను సాల్‌సిట్ టెక్నాలజీస్ రూపొందించింది. ఇప్పుడు ఈ టూల్‌కు హియర్ టెక్నాలజీని జోడిస్తున్నారు, తద్వారా టిబి వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స అందిస్తే నయమయ్యే టీబీని ఈ టెక్నాలజీతో ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స కూడా సులభంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.