Cyber Crime: సైబర్‌ నేరాలకు చెక్‌.. ఏఐ ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

Cyber Crime: ప్రస్తుతం సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు.

Update: 2025-02-13 09:39 GMT

సైబర్‌ నేరాలకు చెక్‌.. ఏఐ ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

Cyber Crime: ప్రస్తుతం సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. రోజురోజుకీ ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గూగుల్ కొత్త నిర్ణయం తీసుకుంది. సైబర్‌ భద్రతను పెంచే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఏంటీ ఫీచర్‌.? ఎలా పనిచేస్తుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌ తీసుకొస్తున్న ఈ ఏఐ ఫీచర్‌ పాస్‌వర్డ్‌లను దానంతటదే మార్చేస్తుంది. ఇది హ్యాకింగ్ వల్ల కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందుకోసం గూగుల్‌ ఆటోమేటెడ్‌ పాస్‌వర్డ్‌ ఛేంజ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ సహాయంతో గూగుల్‌ క్రోమ్‌లో భద్రత పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మీ సిస్టమ్‌ను హ్యాక్‌ చేసినా, మీ డేటా లీక్‌ అయిందని గూగుల్‌ క్రోమ్‌కు తెలిసిన వెంటనే ఏఐ సహాయంతో యూజర్ల పాస్‌వర్డ్‌లను దానంతటదే మార్చేస్తుంది.

పాస్‌వర్డ్ మారిన తర్వాత గూగుల్‌ పాస్‌వర్డ్ మేనేజర్‌కు జోడిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫీచర్‌ ఇప్పటికే గూగుల్ క్రోమ్‌లో అందుబాటులో ఉంది. డేటా లీక్‌ అయినా, హ్యాక్‌ అయినట్లు అనుమానం వచ్చినా వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చుకోమని అడుగుతూ నోటిఫికేషన్ పంపుతుంది. దీంతో యూజర్లు వెంటనే పాస్‌వర్డ్‌ను రూపొందించమని అలర్ట్‌ చేస్తుంది.

అయితే కొత్తగా తీసుకొచ్చిన ఏఐ ఫీచర్‌ సహాయంతో పాస్‌వర్డ్ దానంతటదే మారుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల క్రోమ్ ఆటోమేటిక్ ట్యాబ్ గ్రూపింగ్, స్మార్ట్ హిస్టరీ సెర్చ్ వంటి AI-ఆధారిత ఫీచర్లను పొందింది. ఇది యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. 

Tags:    

Similar News