Valentines Day Offer: వాలెంటైన్స్ డే ఆఫర్స్.. పోకో ఎక్స్7 ప్రో 5Gపై భారీ డిస్కౌంట్
Valentines Day Offer: వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు మీరు తక్కువ ధరలో కొత్త పోకో ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ జనవరిలో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో POCO X7 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో POCO X7, POCO X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లోని పోకో ఎక్స్7 ప్రో 5G భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
పోకో ఎక్స్7 ప్రో 5G ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999 కు లాంచ్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ వీటిపై రూ.3,000 డిస్కౌంట్ ఇస్తుంది. అదనంగా ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, 'బై మోర్' ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 19 వరకు మాత్రమే ఉంటుంది.
ఎక్స్7 ప్రో 5G మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ అందించారు. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ హైపర్ ఓఎస్ 2 ఆధారంగా ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.
స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో OISతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్‌లో 6550mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో డ్యూయల్ 4G వోల్ట్, యూఎస్‌బి టైప్-సి, స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 6.0, Wi-Fi 6, GPS ఉన్నాయి.