iPhone Discount Offer: ఐఫోన్ లవర్స్‌ని టెంప్ట్ చేస్తున్న ఆఫర్స్..ఆ వేరియంట్‌పై రూ.17 వేల డిస్కౌంట్..!
iPhone Discount Offer: గతేడాది ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ ప్రతిసారీ మాదిరిగానే 4 స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.
iPhone Discount Offer: ఐఫోన్ లవర్స్‌ని టెంప్ట్ చేస్తున్న ఆఫర్స్..ఆ వేరియంట్‌పై రూ.17 వేల డిస్కౌంట్..!
iPhone Discount Offer: గతేడాది ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ ప్రతిసారీ మాదిరిగానే 4 స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. వీటిలో ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు ఉన్నాయి. సాధారణ మోడల్ ధర రూ.80 వేలు నుంచి ప్రారంభం కాగా, అత్యంత ఖరీదైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.1,44,900. అయితే ప్రో ఫీచర్స్ అనుభవించాలనే వారికి ఐఫోన్ 16 ప్రో మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ 16 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్‌తో రూ. 17 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డీల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ప్రో ఆఫర్స్
ఐఫోన్ 16 ప్రో ఎటువంటి ఆఫర్ లేకుండా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,12,900కి అందుబాటులో ఉంది. అంటే ఫోన్ లాంచ్ ధర రూ.1,19,900. ఈ మొబైల్ పై రూ.7,000 డిస్కౌంట్ ఇస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ
బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపు అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ ఆప్షన్‌పై రూ. 4500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ద్వారా ఫోన్‌పై భారీ తగ్గింపు ఇస్తోంది. ఇక్కడ మీరు రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. రెండు ఆఫర్‌లను కలిపితే ఫోన్ ధర రూ. 17,000 వరకు తగ్గుతుంది.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 16 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో ప్రత్యేక కెమెరా కంట్రోల్ బటన్ కూడా అందించారు. ఈ బటన్ ఫోటోగ్రఫీకి ప్రియులకు బెస్ట్ ఫీచర్ అవుతుంది. మీరు చాలా ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయాలనుకుంటే కెమెరాను అడ్జస్ట్ చేయడంలో ఈ బటన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్ అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆపిల్ 3nm ఆధారిత A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ చిప్ గేమింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంది. కంపెనీ ఈసారి బ్యాటరీని కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఫోన్‌కు 24 గంటల బ్యాకప్ ఇచ్చే 3367 mAh బ్యాటరీ అందించారు. ఈ మొబైల్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.